ట్రాఫిక్ నియంత్రణపై ఫోకస్ పెట్టండి
డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు హైదరాబాద్ లో జన సాంధ్రత పెరుగతోందని దీనిని దృష్టిలో పెట్టుకుని విపరీతంగా చోటు చేసుకున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చోటు చేసుకున్న ట్రాఫిక్ పై సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎస్ శాంతి కుమారికి.
ముఖ్యంగా తన వాహనం వస్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపి వేయొద్దని మరోసారి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తాము పాలకులం కాదని సేవకులమని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు.