నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు నిధులివ్వండి

Spread the love

కేంద్ర స‌ర్కార్ కు సీఎం చంద్ర‌బాబు విన్న‌పం

ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. శుక్ర‌వారం రాష్ట్రానికి చెందిన మంత్రుల‌తో పాటు కేంద్ర మంత్రుల‌తో క‌లిసి కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి పాటిల్ ను క‌లిశారు. రాష్ట్రంలో నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు. ప్ర‌ధానంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు సీఎం. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం అన్నారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

  • Related Posts

    సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి

    Spread the love

    Spread the loveనిర్మ‌లా సీతారామ‌న్ తో చంద్ర‌బాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం ఢిల్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా…

    మెట్ టీమ్‌ల ప‌నితీరు అభినంద‌నీయం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ప్ర‌తి సంవ‌త్స‌రం చేసే ప‌నే.. కానీ ఈ వ‌ర్షాకాలంలో చేసిన ప‌ని ఎంతో సంతృప్తినిచ్చింది. భారీవ‌ర్షాలు కురిసాయి.. ఒక్క రోజులోనే 10 నుంచి 20 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డ‌డం స‌ర్వ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *