బ‌స్తీ ద‌వాఖానాల్లో వ‌స‌తులు క‌ల్పించాలి

Spread the love

డిమాండ్ చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్ తో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో 4 చోట్ల బస్తి దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఒక్క కెసిఆర్ నగర్ లోని బస్తి దవాఖానలో మినహాయించి మిగతా మూడు బస్తి దవాఖానలు కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డి పల్లి, ఆర్ అండ్ బి కార్యాలయం సమీపంలో లోన్న వాటిల్లో గత 6 నెలల నుండి డాక్టర్ లు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

డాక్టర్ లేక మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కూర్చునే కుర్చీలో దుమ్ము పట్టి ఉండటం పట్ల ఇదేనా బస్తి దవాఖాన తీరని, డాక్టర్లు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తార‌ని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. పేద ప్రజల కోసం బస్తి దవాఖాన లను ఏర్పాటు చేస్తే వాటిని స్తుస్తి దవాఖాన లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.. ఒక వైపు 6 నెలలు గా డాక్టర్ రావడం లేదని..మరో వైపు ఉన్న అటెండర్ కు మూడు నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. ఉన్న స్టాఫ్ నర్స్ కు నవంబర్ నెల జీతం ఇప్పటికి రాలేదని సీరియస్ అయ్యారు.

దవాఖాన మందుల గురించి అడిగి తెల్సుకున్నారు.. మల్టి విటమిన్, లోప్రై మెడ్ ( మోషన్స్ ట్యాబ్లేట్ ), లివో సిట్రిజన్ జలుబు ట్యాబ్లేట్, షూగర్ ట్యాబ్లేట్ మెటఫిన్ తో పాటు ఉండాల్సిన గ్లిమి ఫిరైడ్ 2mg లేవని , అదే విదంగా చిన్న పిల్లలకు సంబందించిన జింక్ సల్ఫేట్ లేవన్నారు.. డాక్టర్ వస్త లేడు.. మందులు లేవు.. అలాంటప్పుడు ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని.. పేద ప్రజలకు అందించే ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యం వీడాలని అన్నారు. వేంటనే బస్తి దవాఖానలో వైద్యులను ఏర్పాటు చేయాలని, సకాలంలో మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *