నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తోంది. క‌బ్జాదారుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. స‌ర్వే నంబ‌రు 186, 191తో పాటు 334ల‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జా అవుతోంద‌ని.. కాపాడాల‌ని బాచుప‌ల్లి మండ‌ల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. క‌బ్జాల‌తో ఇప్ప‌టికే కొంత భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అయ్యింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెంట‌నే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలంటూ హైడ్రాను కోరారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. స‌ర్వే నంబ‌రు 334లో ఇప్ప‌టికే 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాలు జ‌రిగి శాశ్వ‌త నివాసాలు కూడా వ‌చ్చిన‌ట్టు నిర్ధారించుకుంది. నివాసాల జోలికి వెళ్ల‌కుండా.. అక్క‌డ మిగిలి ఉన్న 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో వెలిసిన తాత్కాలిక షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *