భారీ కాన్వాయ్ తో నందిని నామినేషన్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య
హైదరాబాద్ – ఒకరికి ఒకే పదవి అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలో అదేమీ వర్కవుట్ కావడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ లలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కొలువు తీరారు.
తాజాగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు మల్లు భట్టి విక్రమార్క. శనివారం ఆయన సతీమణి నందిని మల్లు భట్టి విక్రమార్క భారీ కాన్వాయ్ తో గాంధీ భవన్ కు ఖమ్మం జిల్లా మదిర నుంచి వెళ్లడం విస్తు పోయేలా చేసింది. ఈ ప్రదర్శన ఎవరి కోసమని జనం ప్రశ్నిస్తున్నారు.
దాదాపు 500 కార్లతో రహదారి పూర్తిగా నిండి పోయింది. ఎక్కడ చూసినా వాహనాలే ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా నందిని భట్టి విక్రమార్క ఇవాళ ఖమ్మం పార్లమెట్ నియోజవర్గానికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రజా బలం ఉందన్నారు. వారంతా తనను ఎంపీగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. తన గెలుపుకు ఢోకా లేదన్నారు నందిని.