2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

తిరుప‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా సూప‌ర్ ప‌వ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తిరుప‌తిలో శుక్ర‌వారం భార‌తీయ విజ్ఞాన్ స‌మ్మేళ‌నాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు… మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు సీఎం. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయని అన్నారు చంద్ర‌బాబు నాయుడు.

2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదని చెప్పారు సీఎం. కానీ విదేశీ పాలన, స్వాతంత్ర్యం వచ్చాక మనం చేసుకున్న కొన్ని పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడిందన్నారు . 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఐటీ రెవల్యూషన్ అంది పుచుకున్నాం అన్నారు. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు సీఎం. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని ప్ర‌క‌టంచారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలు కనాలని మోహన్ భగవత్ చెబుతున్నారు… నేనూ అదే చెబుతున్నా. ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారు. కొన్ని దేశాలు వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు. తిరుగులేని యువశక్తితో కూడిన దేశం మనది. ఈ సంపదే మన దేశాన్ని అగ్ర భాగంలో నిలుపుతుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *