ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్

బ‌య‌ట‌కు వ‌స్తే త‌న్నాల‌ని ఉందంటూ కామెంట్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. బుద్ది ఉన్న ఏ సీఎం ఇలాంటి దిగ‌జారుడు మాట‌లు మాట్లాడ‌ర‌న్నారు. సోయి లేకుండా రోజు రోజుకు దిగ‌జారి పోయి కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ సెక్యూరిటీ మ‌ధ్య‌న ఉన్నాడ‌ని సేవ్ అయ్యాడ‌ని, కానీ బ‌య‌ట‌కు ర‌క్ష‌ణ లేకుండా వ‌స్తే సీన్ వేరేగా ఉంటుంద‌న్నారు కేటీఆర్.

సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వాడుతున్న అసభ్యకర భాష, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఏనాడూ త‌న తండ్రి నిన్ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ లేద‌న్నారు. కేవ‌లం తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌న్నారు. దానిని జీర్ణించు కోలేని నువ్వు చిల్ల‌ర మాట‌లు మాట్లాడితే ఊరుకుంటామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి పదజాలాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నీకు స‌త్తా ఉంటే గ‌తంలో ప్ర‌క‌టించిన హామీల‌న్నీ అమ‌లు చేయాల‌ని స‌వాల్ విసిరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *