బోగీలు దగ్ధం ఒకరు మృతి..జగన్ సంతాపం
అనకాపల్లి జిల్లా : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకోగా ఒకరు మృతి చెందారు. ట్రైన్ నెం. 18189 టాటానగర్ నుండి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం తెల్లవారు జామున జరిగింది. విజయవాడ డివిజన్‌లోని ఎలమంచిలి స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఇది జరిగింది. కొన్ని మెరుపులు రావడంతో ముందుగానే కో పైలెట్ గుర్తించాడు. తక్షణమే రైలును నిలిపి వేశాడు. సుమారు 00.45 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది.
ఈ అగ్నిప్రమాదంలో B1, M2 కోచ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రైల్వే అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగి తక్షణ చర్యలు తీసుకున్నారు .ప్రయాణికులను రైలు నుండి దిగడానికి సహాయం చేశారు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేసింది. ప్రమాదానికి గురైన రెండు కోచ్‌లను వేరు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మరో ఏసీ త్రీ టైర్ కోచ్ (M1)ను కూడా వేరు చేశారు . మిగిలిన రైలును సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. సామర్లకోటలో రైలుకు జత చేయడానికి మూడు ఖాళీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన రెండు కోచ్‌లలోని ప్రయాణికులను బస్సుల ద్వారా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నారు.
ఈలోగా, రైల్వే భద్రతా కమిషనర్/ఎస్‌సిఆర్, డిఆర్‌ఎం తో పాటు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలను తెలుసు కోవడానికి ,ఏదైనా ప్రాణనష్టం జరిగిందా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ,వైద్య బృందం సంఘటనా స్థలానికి బయలుదేరాయి. స్థానిక పరిపాలనతో సమన్వయం చేసుకుంటూ అన్ని అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు .సహాయం అందించడానికి / రైళ్ల రాకపోకల సమాచారం మొదలైన వాటి కోసం రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
ఏలమంచిలి – 7815909386, అనకాపల్లి – 7569305669 , తుని – 7815909479, సామర్లకోట – 7382629990,
రాజమండ్రి – 088 – 32420541, 088 – 32420543, ఏలూరు – 7569305268, విజయవాడ – 0866 – 2575167 ఈ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.







