NEWSNATIONAL

విశ్వాస ప‌రీక్ష‌లో చెంపై స‌ర్కార్ విక్ట‌రీ

Share it with your family & friends

నిరూపించుకున్న పోరాట యోధుడు

జార్ఖండ్ – మోదీ, అమిత్ షా పాచిక‌లు పార‌లేదు. జార్ఖండ్ లో ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని కూల దోసేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. మ‌రాఠాలో ఠాక్రేను కూల్చారు. కానీ సేమ్ సీన్ జార్ఖండ్ లో వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆశించారు. కానీ వ్యూహాలు ఫలించ‌లేదు.

అవినీతి, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగించింది కేంద్రం. ఇందులో ఈడీ, ఐటీ , సీబీఐ రంగంలోకి దిగింది. చివ‌ర‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను అరెస్ట్ చేసేంత దాకా వెళ్లింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం కూలి పోతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) కు మ‌ద్ద‌తుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ.

ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గి త‌మ‌కు ఎదురే లేద‌ని నిరూపించుకుంది జీఎంఎం. మొత్తంగా మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించారు చెంపై సోరేన్. ఆయ‌నకు బ‌ల‌మైన సామాజిక రాజ‌కీయ కోణం దాగి ఉంది. ప్ర‌త్యేక జార్ఖండ్ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించారు.