NEWSNATIONAL

మాదే అధికారం మాదే రాజ్యం

Share it with your family & friends

పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్బంగా మోదీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఏకి పారేశారు. వాళ్ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. వారికి రాబోయే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు.

త‌మ‌కు 545 లోక్ స‌భ సీట్ల‌కు గాను భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ కూట‌మికి క‌నీసం 400కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ ప్ర‌తిప‌క్షాల‌ను , ఎవ‌రినీ ఎద‌గ‌నీయ‌దంటూ ఆరోపించారు ప్ర‌ధాన‌మంత్రి.

త‌మ పార్టీకి స్వంతంగానే మెజారిటీ సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. క‌నీసం తాము 370 సీట్ల‌కు పైగానే రావాల‌ని నిర్ణ‌యించామ‌ని, ఆ మేర‌కు త‌మ పార్టీ శ్రేణులు క‌ష్ట ప‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. మూడోసారి కొలువు తీరిన త‌ర్వాత దేశంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాంమ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు మోదీ.