ప్రగతి నగర్ చెరువులో ప్రత్యామ్నాయం
హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే సమయంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెరువు పక్కన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కమిషనర్. ఇవాళ పలు స్థలాలను విధి నిర్వహణలో భాగంగా పరిశీలించారు. అక్కడ వ్యాపారాలు సులభంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రగతినగర్ చెరువును పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
చెరువు పరిసరాల్లో చెత్త గుట్టలను ఇప్పటికే 150 లారీల వరకూ తరలించామని చెప్పారు. చేపలు, చికెన్, మాంసం వ్యర్థాలు చెరువులో కలుస్తుండడంతో పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయని స్థానికులు ఈ సందర్భంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చిరు వ్యాపారులను ఇక్కడి నుంచి తరలించాలని పలువురు కోరారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించి చిరు వ్యాపారులను అక్కడకు తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య , ఏసీపీ ఉమామహేశ్వర్ తో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు.






