క‌విత.. కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు

Spread the love

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డికి అనుచ‌రుడిగా పేరు పొందిన మ‌ల్ రెడ్డి రంగారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త కొంత కాలంగా త‌ను బీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా హ‌రీష్ రావు, కేటీఆర్, చివ‌ర‌కు తండ్రి అని చూడ‌కుండా కేసీఆర్ ను సైతం విమ‌ర్శ‌ల‌తో విరుచుకు ప‌డింది. ఈ త‌రుణంలో త‌న వెనుక పెద్ద శ‌క్తులు ఉన్నాయ‌ని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

తాజాగా క‌విత గురించి కూడా సీరియ‌స్ గా స్పందించారు మ‌ల్ రెడ్డి రంగారెడ్డి. దానం, కడియం మా పార్టీ లోకి వస్తార‌ని అనుకున్నామా , ఏనాడూ ఊహించ లేద‌న్నారు . అలాగే క‌విత కూడా త‌మ పార్టీలోకి వ‌చ్చేందుకు ఎక్కువ‌గా ఛాన్స్ ఉంద‌న్నారు. ఇక రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానం మాత్ర‌మేన‌ని ఆయ‌న కొట్టి పారేశారు. .రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు.. కానీ, జిల్లా స్వరూపం మారొద్దని స్ప‌స్టం చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ జిల్లా కు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదని వాపోయారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ కే నష్టం..నాకు నష్టం లేదు ,పార్టీ పెద్దలు ఆలోచించాలని అన్నారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *