సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల మోత

ప్ర‌క‌టించిన ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డి

హైద‌రాబాద్ : ఓ వైపు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసం భారీ ఎత్తున బ‌స్సుల‌ను న‌డిపిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అంతే కాకుండా హైద‌రాబాద్ నుంచి అత్య‌ధికంగా ఏపీకి వెళ‌తారు. దీంతో ఈసారి వారిపై ఎలాంటి భారం వేయ‌బోమంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సంస్థ ఎండీ నాగిరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ‌ను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో 6,400 కు పైగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని ప్రధాన బస్ స్టేషన్ల నుండి ఎంపిక చేసిన తేదీలలో ప్రత్యేక సర్వీసులు న‌డుస్తాయ‌ని తెలిపారు.

ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9, 10, 12, 13, 18 మరియు 19 తేదీలలో నడపబడతాయి. ఈ ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్న‌ట్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ బస్సులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) , జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్ల నుండి, అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్స్, ఆరామ్‌ఘర్, ఎల్బీ నగర్, బోవెన్‌పల్లి, కేపీహెచ్‌బీ , గచ్చిబౌలితో సహా ఇతర ముఖ్య ప్రదేశాల నుండి అందుబాటులో ఉంటాయని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఏకంగా 50 శాతం పెంచ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌యాణీకులు. నిలువు దోపిడీ నుంచి ర‌క్షించాల‌ని కోరుతున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *