పొంగులేటిని ఏకి పారేసిన కేటీఆర్

ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని ఫైర్

ఖ‌మ్మం జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఖ‌మ్మం జిల్లాకు చెందిన మంత్రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌మీష‌న్ల‌పైన ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల పై లేకుండా పోయింద‌న్నారు కేటీఆర్. ఆయ‌న ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. ఇచ్చిన హామీల సంగ‌తి ఏమిటో చెప్పాల‌న్నారు. మంత్రి పొంగులేటి దీపావళికి బాంబులు పేలుతాయని అన్నాడు.. రెండు దీపావళిలు పోయాయి కానీ బాంబులు మాత్రం పేలలేదంటూ ఎద్దేవా చేశారు. మంత్రుల‌కు ప్ర‌త్యేకించి పొంగులేటికి అంత సీన్ లేద‌న్నారు.

ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ అయితే మోదీ, అదానీ కాళ్ళు పట్టుకొని కేసు అవ్వకుండా బీజేపీకి మోకరిల్లాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. ఇంకో మంత్రి తుమ్మల నేను వస్తున్నా అని కార్పొరేటర్ల ఇండ్లు తిరిగి ముగ్గురిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయాడని ఫైర్ అయ్యారు. ప్రజలు అనుకుంటే ఎంతమంది కార్పొరేటర్లను ఎత్తుకొని పోయినా తుమ్మల పీకేది ఏం ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతమంది కార్పొరేటర్లు పోయినా, యువతకు అవకాశం ఇచ్చి కొత్త నాయకులను తయారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *