అవ‌గాహ‌న ఉంటేనే ఆదుకోగ‌లం : హైడ్రా

నిరంత‌ర శిక్ష‌ణ వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది
హైద‌రాబాద్ : యువ ఆప‌ద మిత్రలు సేవలు అందించేందుకు ముందుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. ఈ వారం పాటు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మందికి చేర వేయాలని యువకులను కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను అదనపు డైరెక్టర్ నివృత్తి చేశారు.

అంతే కాకుండా వారి అభిప్రాయాలను కూడా సేకరించారు. చెరువుల పునరుద్ధరణ, ప్రజా అవసరాల స్థలాలు, పార్కుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని విద్యార్థులు ప్రశంసించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ గౌర‌వ్‌, మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ గంట రాజేష్, హైడ్రా ఆర్ఎఫ్‌ఓ జయ ప్రకాశ్, డీపీవోలు యజ్ఞ నారాయణ, గౌతమ్, ఏడీఎఫ్‌వో మోహ‌న‌రావు, ఇన్‌స్పెక్ట‌ర్ షంషుద్దీన్‌, ఎన్‌డీఎంఏ క‌న్స‌ల్టెంట్ డా. గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు పలు సూచనలు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *