పాడి ప‌రిశ్ర‌మ‌తో గ‌ణ‌నీయ‌మైన ఆదాయం

మ‌హిళా సాధికార‌త‌కు ఊతం ఇస్తుంది

కేర‌ళ : పాడి ప‌రిశ్ర‌మ ద్వారా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. కేర‌ళ‌లో సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. స‌ద‌ర‌న్ పాడి సంస్థ రాబోయే రోజుల్లో విజ‌యాన్ని సాధించాల‌ని కోరారు. దేశ డెయిరీ రంగం పురోగతికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు అచ్చెన్నాయుడు. ఫెలిసిటేషన్‌కు సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు కూడా ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌ను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. నారా భువనేశ్వరి , హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అని మంత్రి పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల కృషి, దూరదృష్టి గల నాయకత్వంతో హెరిటేజ్ ఫుడ్స్ భారతీయ డెయిరీ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆమె నాయకత్వంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ద్వారా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌ను హెరిటేజ్ ఫుడ్స్ మూడు సార్లు పొందిందని మంత్రి గుర్తు చేశారు. నారా భువనేశ్వరి కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాకుండా, దయాగుణాలు కలిగిన ఉత్తమ మానవీయ విలువలు గల వ్యక్తి కూడా కొనియాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, విద్య, ఆరోగ్యం, మహిళా యువజన అభివృద్ధి, విపత్తు సహాయం వంటి రంగాల్లో వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆమె అంకిత భావంతో సామాజిక సేవ చేస్తూ ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *