NEWSTELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం షాక్

Share it with your family & friends

ఓటుకు నోటు కేసులు నోటీస్

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఓటుకు నోటు కేసులో ఆయ‌న ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌స్తుత సీఎం అరెస్ట్ అయ్యారు. జైలు పాల‌య్యారు. త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇదే కేసుకు సంబంధించి విచార‌ణ కొన‌సాగుతోంది.

అనంత‌రం ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందారు. ఆ త‌ర్వాత ఆ కేసు కొన‌సాగుతూనే వ‌స్తోంది. తాజాగా ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కొలువు తీరారు. ప్ర‌స్తుతం అన్ని శాఖ‌లు కొంద‌రికి మాత్ర‌మే ఇచ్చినా ప్ర‌ధానంగా హోం శాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్నారు రేవంత్ రెడ్డి తెలివిగా.

దీనిని ప‌సిగ‌ట్టింది బీఆర్ఎస్ పార్టీ. త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఇరుకున పెట్టాల‌నే ఉద్దేశంతో మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఏకంగా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీఎంగా, హోం మంత్రిగా తానే ఉన్నాడ‌ని, దీని వ‌ల్ల ట్ర‌య‌ల్ జ‌రిపితే విచార‌ణ‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేసింది.