అవ‌స‌ర‌మైతే సీఎం, డిప్యూటీ సీఎంల‌ను పిలుస్తాం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క లో రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. నువ్వా నేనా అంటూ సీఎం ప‌ద‌వి కోసం పంచాయ‌తీ కొన‌సాగుతోంది సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ . ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి సీఎం ప‌ద‌వి మార్పు ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం కొన‌సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. అవసరమైతే సిద్ధరామయ్య, శివకుమార్‌లను చర్చలకు పిలుస్తాం అని అన్నారు. మ‌రో వైపు డీకే శివ‌కుమార్ మాట్లాడుతూ తన కఠోర శ్రమ తనను రాజకీయాల్లో ఇంత దూరం తీసుకువచ్చిందని, తన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే భవిష్యత్ నిర్ణయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇటీవల దేవరాజ్ ఉర్స్ నెలకొల్పిన రికార్డును అధిగమించి రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచిన సిద్ధరామయ్య, తాను పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చర్చల కోసం ఢిల్లీకి ఎప్పుడు పిలుస్తారంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఖ‌ర్గే స‌మాధానం ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. అవసరమైనప్పుడల్లా పార్టీ వారిని పిలుస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో నాయకత్వ పోరు తీవ్రమైంది. 2023లో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో సిద్ధరామయ్య , శివకుమార్‌ల మధ్య కుదిరినట్లు చెబుతున్న “అధికార పంపకాల” ఒప్పందం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *