నారా వారి ప‌ల్లెలో చంద్ర‌బాబు కుటుంబం

సంక్రాంతి వేళ పుట్టిన గ‌డ్డ‌కు చేరుకున్నారు

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబం సంద‌డి చేసింది స్వంత ఊరు నారా వారి ప‌ల్లెలో. చంద్ర‌బాబుతో పాటు భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా లోకేష్ తో పాటు మ‌నుమ‌డు కూడా త‌మ ఊరికి చేరుకున్నారు. సంక్రాంతి పర్వదినం వేళ.. పుట్టిన గడ్డపై మమకారంతో, తన సొంత గ్రామం నారావారి పల్లెకు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం కుటుంబీకుల‌కు పెద్ద ఎత్తున గ్రామ‌స్థులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు పేరు పేరునా ప‌ల‌క‌రించారు ప్ర‌తి ఒక్క‌రినీ.

ఇదిలా ఉండ‌గా నారా వారి ప‌ల్లెకు చేరుకున్న సీఎం కుటుంబీకుల‌ను ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు, ఇత‌ర ప్ర‌ముఖులు క‌లుసుకుంటున్నారు . ముఖ్య‌మంత్రిగా కొలువు తీరాక ఈసారి పెద్ద ఎత్తున అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. దేశంలోనే త‌న ఊరును రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. సీఎం ఊరు కావ‌డంతో నారా వారి ప‌ల్లెను పెద్ద ఎత్తున అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు ఉన్న‌తాధికారులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *