సంచలన ప్రకట చేసిన పార్టీ చీఫ్ విజయ్
చెన్నై : ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన ప్రకటన చేశారు. డీఎంకే సర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన సిద్దమయ్యారు. ఇప్పటికే తనను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వస్తున్న సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కేంద్రంలోని అమిత్ షా, మోదీతో యుద్దానికి సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక జనాదరణ కలిగిన నటులలో తను టాప్ లో కొనసాగుతున్నాడు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ను కలిగి ఉన్నాడు. తన ఫ్యాన్స్ ఒత్తిడిని తట్టుకోలేక సింగపూర్ లో తన సినిమాను ఆడియో లాంచ్ చేయాల్సి వచ్చింది.
ఈ తరుణంలో జన నాయగన్ తన చివరి చిత్రం అర్దాంతరంగా ఆగి పోవడంతో విజయ్ ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇవాళ సంచలన ప్రకటన చేశాడు. తాము త్వరలో జరగబోయే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మొత్తం 234 శాసన సభ స్థానాలలో పోటీ చేస్తామని వెల్లడించాడు. ఇదిలా ఉండగా తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.







