తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. 25న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన‌ట్లు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జ‌ర‌గ‌ని స్ప‌ష్టం చేశారు ఈవో. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల‌ను కూడా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

అంతే కాకుండా ఆర్జిత సేవ‌లు కూడా ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు అనిల్ కుమార్ సింఘాల్. ఇదిలా ఉండ‌గా ఈవో మీడియాతో విడుద‌ల చేసిన అధ‌ఙ‌కారిక ప్ర‌క‌ట‌న‌లో మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి సామాన్యుల‌కు అత్య‌ధికంగా పెద్ద పీట వేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఇందులో భాగంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు రికార్డు స్తాయిలో భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని చెప్పారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ అనిల్ కుమార్ సింఘాల్ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *