టెక్నాల‌జీతో అనుసంధానం ప‌రిశ్ర‌మ‌ల‌కు అందలం

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీలో టెక్నాల‌జీకి ప్రాధాన్య‌త ఇస్తూ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్నార‌ని తెలిపారు. స్వంత ఊరిలో సంక్రాంతి పండుగ‌ను జ‌రుపు కోవ‌డం మ‌రింత ఆనందం క‌లిగించింద‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయని తెలిపారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్ప తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా చాటార‌ని ప్ర‌శంసించారు. ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సొంత గ్రామస్తులతో గడిపే సాంప్రదాయంలో భాగంగా నేను కూడా నా కుటుంబంతో కలిసి నారావారిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని అన్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జగ్గన్నతోట ప్రభల తీర్థం కార్యక్రమాన్ని ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకున్నాం అని తెలిపారు. ఏకాదశ రుద్రులు ఒక్క చోట చేరార‌ని, లక్షల మంది భక్తులు పాల్గొన్నార‌ని, ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌ర‌గింద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. వైభవోపేతంగా జరిగిన ప్రభల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పింద‌న్నారు ఇదే సమయంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామ‌న్నారు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ తో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి అవుతుందని వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *