ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన సునీతా విలియ‌మ్స్

ధ్రువీక‌రించిన నాసా..ఒక మ‌హిళ‌గా రికార్డ్

ఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ త‌న విధుల నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. త‌ను గ‌త కొన్నేళ్లుగా విశిష్ట సేవ‌లు అందించారు. అంతే కాదు అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ఏకంగా 27 ఏళ్ల పాటు త‌ను నాసా (అంత‌రిక్ష కేంద్రం) లో ప‌ని చేశారు. విశిష్ట సేవ‌లు అందించారు. త‌ను మాజీ నేవీ కెప్టెన్ గా ఉన్నారు. 60 ఏళ్ల పాటు విశిష్ట సేవ‌లు అందించిన అనంత‌రం త‌ను గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో నా సా నుంచి విన‌మ్రంగా త‌ప్పుకున్నారు. త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఏకంగా మూడు రోద‌సీ స్టేష‌న్ల‌లో 608 రోజుల పాటు అంత‌రిక్షంలో గ‌డిపారు.

అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన స‌మ‌యంగా రికార్డు సృష్టించింది, అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది సునీతా విలియ‌మ్స్. తొమ్మిది విహార యాత్రలలో 62 గంటలు పాటు ఉన్న‌ది. ఈ సంద‌ర్బంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంలో విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సునీతా విలియ‌మ్స్. నాసా నిర్వాహ‌కుడైన జారెడ్ ఇసాక్ మాన్ సునీతా విలియ‌మ్స్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మాన‌వ అంత‌రిక్ష ప్ర‌యాణంలో ట్రైల్ బ్లేజ‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. మీ అర్హ‌త క‌లిగిన ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లంటూ పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *