ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు

ఇప్ప‌టికే మాజీ మంత్రి హ‌రీశ్ రావు విచార‌ణ

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్ర‌వారం త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఉద‌యం 11.25 గంట‌ల నుండి రాత్రి 7 గంట‌ల కు పైగా సిట్ విచార‌ణ ఎదుర్కొన్నారు. రెండు రోజుల అనంత‌రం ఈ సిట్ చ‌ర్య తీసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తన దర్యాప్తును ముమ్మరం చేస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు నోటీసు జారీ చేసింది, శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని కోరింది. కాగా నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు. మ‌రో వైపు సిట్ ను రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌త్యేక విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. దీంతో విచార‌ణ క‌మిటీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేయ‌డం మొద‌లు పెట్టింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *