ప్ర‌జ‌ల కంటే ప‌ద‌వులే క‌డియంకు ముఖ్యం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిప్పులు చెరిగారు .ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న‌కు రాజ‌కీయ విలువలు ఏ మాత్రం లేవ‌న్నారు. ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా కేవ‌లం త‌మ‌ను డ్యామేజ్ చేసే ఉద్దేశంతో వార్త‌ల‌ను రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. మీడియా వాళ్లు కొంచెం వాస్తవాలు రాయాల‌ని సూచించారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.
పత్రికా, మీడియా మిత్రులకు కడియం శ్రీహరిని ఎట్లా పొగడబుద్డి అవుతుంది అంటూ ప్ర‌శ్నించారు.

సిగ్గులేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతాడంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. నీకు గ‌నుక దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అడ‌గాల‌న్నారు. ప్ర‌జ‌లు ఛీ కొట్టేందుకు రెడీగా ఉన్నార‌ని అన్నారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల బాగోగ‌ల కంటే ప‌ద‌వులే ముఖ్య‌మ‌న్నారు. మొద‌ట టీడీపీలో ఉన్నాడు, ఆత‌ర్వాత టీఆర్ఎస్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు కేవ‌లం పోస్టు కోసం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యాడ‌ని, ఆయ‌న‌కు రాజ‌కీయ విలువ‌లు ఏమాత్రం లేవ‌న్నారు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. త‌న‌కు క‌లేజా ఉంటే త‌ను విసిరిన స‌వాల్ ను స్వీక‌రించాల‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *