మోదీతో క‌ర‌చాల‌నం డిప్యూటీ మేయ‌ర్ ఆనందం

ఈ చ‌ర్య‌తో నా జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్న ఆషా నాథ్

కేర‌ళ : ఇది ఎవ‌రూ ఊహించ లేదు. గ‌త కొన్నేళ్లుగా కేర‌ళ రాష్ట్రాన్ని క‌మ్యూనిస్టులు ఏళుతున్నారు. ఇక తిరువ‌నంత‌పురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత శ‌శి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయ‌న ఈ మ‌ధ్య ఎక్కువ‌గా బీజేపీతో ట‌చ్ లో ఉంటున్నారు. ఇదేక్ర‌మంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఈ త‌రుణంలో తిరువ‌నంత‌పురంలో ఇటీవ‌ల న‌గ‌ర ఎన్నిక‌లు జ‌రిగాయి. బిగ్ షాక్ ఇస్తూ ఇక్క‌డ తొలిసారిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. పూర్తి మెజారిటీని సాధించింది. క‌మ్యూనిస్టుల కోట‌లో కాషాయ జెండా ఎగుర వేయ‌డం మామూలు విష‌యం కాదు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ , కార్పొరేట్ల ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఈ సంద‌ర్బంగా డిప్యూటీ మేయ‌ర్ గా కొలువు తీరిన ఆషా నాథ్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆమెతో క‌ర‌చాల‌నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ సంద‌ర్బంగా త‌ను ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మోదీ క‌ర‌చాల‌నంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్నారు. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు. ఇది నా ఆత్మలో చెక్కబడిన ఒక మధుర క్షణం అని పేర్కొన్నారు. అంతే కాదు అత్యంత గౌరవంతో నేను వంగి ఆయన పాదాలను తాకినప్పుడు, అధికార శిఖరాగ్రాన ఉన్న ప్రధానమంత్రి మోదీజీ, వినయ పూర్వకంగా న‌న్ను ఆశీర్వ‌దించారంటూ సంతోషం వ్య‌క్తం చేశారు ఆషా నాథ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *