గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయ‌కం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

మ‌హారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బ‌హ‌దూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపార‌ని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆయ‌న మ‌రాఠాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా సీఎం ఫ‌డ్న‌వీస్ తో క‌లిసి గురుద్వారాను సంద‌ర్శించారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. ఇదిలా ఉండ‌గా శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మ‌రిచి పోలేన‌ని అన్నారు ఉప ముఖ్యమంత్రి.

ఇదిలా ఉండ‌గా నాందేడ్ కు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీ గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్ , ఆయన కుమార్తె భోకార్ శాసన సభ్యురాలు శ్రీజయ చవాన్, శాసన మండలి సభ్యులు రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే , తదితరులు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పిన వారిలో ఉన్నారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు అజిత్ గోప్ చడే, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు రాజేంద్ర కోడగే పాల్గొన్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *