కేంద్ర స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిల‌

Spread the love

ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాలి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కేంద్రంలోని బీజేపీ మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. విజ‌యవాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్ తో పిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని ప్ర‌క‌టించారు. ఆనాడు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చేతుల మీదుగా పథకం ప్రారంభించిన బండ్లపల్లి గ్రామం నుంచే మన్రేగా పరిరక్షణ పోరాటం జరగనుంద‌ని ప్ర‌క‌టించారు.

ఏపీసీసీ రాష్ట్ర‌ అధ్యక్షురాలిగా స్వయంగా తానే ప్రతి జిల్లాలో ఉపాధి హామీ పనితో లబ్ధి పొందిన కుటుంబాలను కలిసి, బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన గ్రామ్ జి ( VB G – RAM G) చట్టంతో జరిగే నష్టాలను వివరించ బోతున్నాం అన్నారు . మోడీ తెచ్చిన కొత్త అక్రమ చట్టాన్ని రద్దు చేసే వరకు, తిరిగి కొనసాగిస్తామని చెప్పే వరకు ఉద్యమాన్ని రాష్ట్రంలో ఉదృతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌టించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలను వివరిస్తూ సాగే మన్రేగా పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన గోడ పత్రిక ను నేడు ఆంధ్రరత్న భవన్ లో విడుదల చేశారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *