ఏప్రిల్ 7న రానున్న మ‌హేష్ బాబు వార‌ణాసి

Spread the love

ప్ర‌పంచ వ్యాప్ంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వార‌ణాసి. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు ప్రిన్స్ మ‌హేష్ బాబు, న‌టి ప్రియాంక చోప్రా. మ‌రో కీల‌క పాత్ర పోషించాడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఏడాది 2027, ఏప్రిల్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడ‌దుల చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా మహేష్ బాబు కూడా తన స్పందనను పంచుకున్నారు. ప్రేమను , శక్తిని ప్రతి క్షణం స్వీకరిస్తున్నాను. ఇదిగో మిమ్మ‌ల్ని అల‌రించేందుకు వార‌ణాసి సిద్దం అవుతోంద‌ని పేర్కొన్నాడు.

ఎంతో దూరం నుండి వ‌చ్చిన మాకు , బృందానికి ఇంత ప్రేమ‌ను కురిపించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మీ అంద‌రిని క‌లుస్తాన‌ని పేర్కొన్నారు. కీ రోల్ పోషించిన మ‌రో న‌టి ప్రియాంక చోప్రా కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక గ్లింప్స్ మాత్ర‌మేన‌ని, ఇంకా చాలా ఉంద‌ని, తాను కూడా మీతో పాటు వార‌ణాసి సినిమా కోసం ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ సినిమాపై, త‌మ‌పై చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని తెలిపింది.

కాగా వార‌ణాసి టీజర్ భారతదేశంలోని పురాతన నగరాలలో ఒకటైన వారణాసి విశాలమైన డ్రోన్ షాట్‌తో ప్రారంభమవుతుంది. ఇది క్రీ.శ. 521 నాటిదని నమ్ముతారు. ఆ తర్వాత దృశ్యాలు, అంటార్కిటికా, ఆఫ్రికా .వారణాసిలోని మణికర్ణికా ఘాట్ సహా ఇతర ప్రదేశాలలో చిత్రీకరించబడిన, భూమిని ఢీకొనే గ్రహశకలం సంభవిని చూపించే నాటకీయ సన్నివేశానికి మారుతాయి. ఈ టీజర్ రుద్రుడిగా మహేష్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ, త్రిశూలం పట్టుకుని ఉన్న అద్భుతమైన చిత్రంతో ముగుస్తుంది,

  • Related Posts

    తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌ హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని…

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *