నేడే ఇండియా పాకిస్తాన్ బిగ్ ఫైట్

దాయాదుల పోరుపై తెగ‌ని ఉత్కంఠ

దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆదివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు , స‌ల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా ఉన్న పాకిస్తాన్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. ఇక ఆసియా క‌ప్ విష‌యానికి వ‌స్తే రెండు టీమ్ లు త‌మ త‌మ తొలి మ్యాచ్ ల‌లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశాయి. టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఇక ఆసియా క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 13 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 10 సార్లు టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేస్తే పాకిస్తాన్ కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే విజ‌యం సాధించింది. మొత్తంగా యావ‌త్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠ భ‌రితంగా చూస్తోంది.

జ‌ట్ల ప‌రంగా చూస్తే భార‌త్ జ‌ట్టుకు సూర్య కుమార్ యాద‌వ్ కెప్టన్ కాగా , శుభ్ మ‌న్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, పాండ్యా, శివ‌మ్ దూబే, జితేశ్ శ‌ర్మ , అక్ష‌ర్ ప‌టేల్, బుమ్రా, వ‌రుణ్ , అర్ష్ దీప్ , కుల్దీప్ , సంజూ శాంస‌న్ , హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.

పాకిస్తాన్ జ‌ట్టుకు స‌ల్మాన్ అలీ అఘా కెప్టెన్ కాగా, అబ్రార్, ఫ‌హీమ్ , ఫ‌ఖ‌ర్ జ‌మాన్ , హ‌రీష్ ర‌వూఫ్ , హ‌స‌న్ అలీ, హ‌స‌న్ న‌వాజ్ , హుస్సేన్ త‌లాత్ , ఖుష్టిల్ వాజ్, మొహ‌మ్మ‌ద్ వా, షా మ‌హ‌మ్మ‌ద్ షా, జూనియ‌ర్, ఫ‌ర్హాన్ , సైమ్ అయూబ్, స‌ల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్ ఆడ‌తారు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *