ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం

Spread the love

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామి వారి ఊరేగింపులో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ముని కుమారన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి…

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *