లోక్ స‌భ స్పీక‌ర్ తో వైసీపీ ఎంపీలు ములాఖ‌త్

Spread the love

స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వ‌హ‌ణ‌పై విస్తృతంగా చ‌ర్చ‌

న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్ల‌మెంట్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు, లోక్‌సభ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ప్ర‌ధానంగా పార్లమెంట్ పనితీరును మరింత మెరుగు పరచడానికి ఎంపీల అభిప్రాయాలు, సూచనలను స్పీకర్ ఓం బిర్లా ఎంపీల‌ను కోరారు. సభా వ్యవహారాలు మరింత సజావుగా సాగేందుకు కొత్త విధానాలు, మెరుగైన సమన్వయం, బలమైన మద్దతు వ్యవస్థలు అవసరమని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు.

అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రతిపాదనకు స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు.
ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి , అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను శాలువాతో సత్కరించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *