ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాలి

డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

అనంత‌పురం జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించే జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్ర స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం అనంతపురం జిల్లాలో మూడో రోజు కొన‌సాగింది. కళ్యాణదుర్గం నియోజక వర్గం, ఐదుకల్లు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు మన్రేగా చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం తమ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి జరిగాయని, గ్రామ్ జి చట్టం తెచ్చి మోదీ కరువు పనిపై కుట్రలు చేయడం దారుణమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ఉపాధి హామీ పరిరక్షణ పోరాటానికి ఐదుకల్లు గ్రామస్థులు ముక్త కంఠంతో మద్దతు ప్రకటించడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. వీరి మ‌ద్ద‌తు వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *