సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ కంపెనీ ఆయనకు కారును బహుమతిగా ఇచ్చిందన్నారు. 2018లో రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు, కేఎల్ఎస్ఆర్ బహుశా వారి షెల్ కంపెనీ అయి ఉండవచ్చని ఏజెన్సీలు కూడా చెప్పాయన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుండి వచ్చిన డబ్బును ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలలో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు.
తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేని ఆ కంపెనీకి రూ. 6000 కోట్ల విలువైన ప్రభుత్వ పనులను అప్పగించారని ఆరపించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి కంపెనీకి ప్రభుత్వ పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఏజెన్సీలను పంపి విచారణ జరిపి, నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమాని ఎవరు?… దీనిపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.






