పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్య‌క్షుడు

హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై భ‌గ్గుమ‌న్నారు. నీకు అంత సీన్ లేద‌న్నారు. ఇక్క‌డ ఏం ప‌ని ఉంద‌ని తెలంగాణ‌లో ప్ర‌చారం చేసేందుకు వ‌స్తాడంటూ ఎద్దేవా చేశారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఎవ‌రూ ఊరుకోర‌ని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని స్ప‌ష్టం చేశారు. త‌మ ఆత్మ గౌర‌వంకు భంగం క‌ల‌గించేలా ఎవ‌రు మాట్లాడినా లేదా ప్ర‌య‌త్నం చేసినా అడ్డుకుని తీరుతార‌ని అన్నారు.

భిక్షాందేహి అని పవన్ కళ్యాణ్‌ను అడుక్కునే దీన స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మ‌హేష్ కుమార్ గౌడ్. కులం, మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోయేందుకు సిద్దంగా లేర‌న్నారు . పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకో.. తెలంగాణలో కాదు అని హిత‌వు ప‌లికారు టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *