తాండూరు ప్ర‌జ‌ల దాహార్తిని తీరుస్తాం : సీఎం

Spread the love

ప్ర‌క‌టించిన అనుముల రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాండూరును అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని అందించే కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ వ‌ర‌కు, అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ మణిహారంగా త్రిబుల్ ఆర్, అలాగే రేడియల్ రోడ్లను పూర్తి చేస్తామని, రాబోయే రోజుల్లో వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు రేవంత్ రెడ్డి.

అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రధానంగా రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళలు ప్రాధాన్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రూ. 567.69 కోట్ల చెక్కుల‌ను మహిళా ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, శాస‌న మండ‌లి చీఫ్ విప్ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్

    Spread the love

    Spread the loveకీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన డీఎస్పీ చల‌సాని, సీఐ పెన‌మ‌లూరు : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైత‌న్య కాలేజీలో చ‌దువుతున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది. స‌హ‌చ‌ర విద్యార్థులు త‌న‌పై…

    మ‌దిర‌తో ఎన్నో జ‌న్మ‌ల బంధం : భ‌ట్టి విక్ర‌మార్క‌

    Spread the love

    Spread the loveన‌న్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేప‌ట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *