రేవంత్ రెడ్డి సీఎంగా ఫెయిల్ : హ‌రీశ్ రావు

Spread the love

420 హ‌మీలు ఎక్క‌డ అమ‌లు అయ్యాయో చెప్పాలి

సంగారెడ్డి జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యాడు. రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశాడ‌ని, పాల‌న చేత‌కాక త‌మ‌పై నోరు పారేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 15 కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డ్ సృష్టించారు హ‌రీశ్ రావు. ఇస్నాపూర్ (చిత్కుల్), ఇంద్రేశం (బాచుగూడ), సంగారెడ్డిలో 5, సదాశివపేటలో 3, జహీరాబాద్‌లో 3, కోహిర్‌లో 2 మీటింగ్స్‌తో దద్దరిల్లింది ఉమ్మడి మెదక్ జిల్లా. ప్ర‌తిప‌క్షాల‌నే కాదు త‌న‌ను న‌మ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌ను కూడా త‌న నోటి దూల‌తో వ‌ద‌ల‌డం లేద‌న్నారు.

రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో, ఈ ఎన్నికలు అసలుకు నకిలీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటున్నాడని పేర్కొన్నాడు. నీ రెండేళ్ల పాలనలో జనాలు నిన్నే నకిలీ గాడి లాగా చూస్తున్నారని గుర్తించుకుంటే మంచిద‌న్నాడు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. నీలాంటి మూట‌లు మూసినోడికి తెలంగాణ చ‌రిత్ర గురించి ఏం తెలుసు అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ను, వాళ్లు త‌లుచుకుంటే నిన్ను ఈ క్ష‌ణ‌మే గ‌ద్దె దించుతార‌ని, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని హెచ్చ‌రించారు హ‌రీశ్ రావు.

  • Related Posts

    ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

    Spread the love

    Spread the loveఅమిత్ షా, నిర్మాలా సీతారామన్ ల‌తో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.…

    పోలీసుల‌పై గాద‌రి కిషోర్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని కేసుల‌పై ఫైర్ న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల ప‌నితీరు దారుణంగా ఉంద‌న్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు ప‌నిగ‌ట్టుకుని త‌మ‌ను ల‌క్ష్యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *