ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది

వైసీపీ లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి

అమ‌రావ‌తి : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, అధికారం ఉంది క‌దా అని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైసీపీ లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న న్యాయ ప‌ర‌మైన కెరీర్ లో ఒక వ్య‌క్తిపై పెద్ద ఎత్తున కేసుల‌ను న‌మోదు చేయ‌డం చూడ‌లేద‌న్నారు. మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై ఏకంగా 38 అక్ర‌మ కేసుల‌ను బ‌నాయించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ వైపు ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామంటూ మ‌రో వైపు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు, మాజీ మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టార్గెట్ చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి.

ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. కూటమి పాలనలో బాధతులు జైల్లో ఉన్నార‌ని, కానీ అస‌లైన‌ నిందితులు బయట ద‌ర్జాగా తిరుగుతున్నార‌ని వాపోయారు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కక్షతో రెండు రోజుల్లో 36 కేసులు పెట్టించారని , ఇదెక్క‌డి ప్ర‌జాస్వామ్యం అని నిల‌దీశారు రాష్ట్ర కూట‌మి స‌ర్కార్ ను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..ఒక్క మనిషి మీద ఇన్ని కేసులు పెట్టడం అని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చట్టాన్ని లెక్కచేయని పోలీసులకు తగిన శిక్ష తప్పదని హెచ్చ‌రించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *