చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు

విజ‌య‌వాడ : తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని సిట్ తేల్చింద‌ని దీంతో నిన్న‌టి దాకా రాజ‌కీయం చేస్తూ వ‌చ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, మంత్రి నారా లోకేష్ బేష‌ర‌తుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌న్నారు. కల్తీ జరిగింది అని చెప్పిన ట్యాంకర్లన్నీ తనిఖీ చేసి పంపించింది కూటమి ప్రభుత్వమే న‌ని పేర్కొన్నారు. దీనిలో వైసీపీ కి సంబంధం ఏమి ఉందో చెప్పాల్సిన అవ‌స‌రం సీఎం, డిప్యూటీ సీఎంల‌పై ఉంద‌న్నారు దేవినేని అవినాష్.

సుప్రీంకోర్టు కూడా ఈ విష‌యంలో ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింద‌న్నారు. అయినా వీరికి బుద్ది రాలేద‌న్నారు. సోయి లేకుండా మాట్లాడటం అల‌వాటుగా మారంద‌న్నారు. దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. హిందువుల‌కు అండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌ది త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినేన‌ని తేలి పోయింద‌న్నారు. టీటీడీ లడ్డు ప్రసాదం పై అపనమ్మకం తీసుకొచ్చింద‌న్నారు.
2014-19 మధ్య వందలాది హిందీ గుడులు కూల్చింది త‌న హ‌యాంలోనేన‌ని పేర్కొన్నారు. శ్రీశైలంలో శివ భక్తుల మీద పోలీసులు దారుణంగా దాడి చేశారని, ఇందుకు సంబంధించి వీడియోలు చూసిన భ‌క్తులు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌ని అన్నారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక మీడియాపై చిందులు వేస్తున్నార‌ని ఆరోపించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *