టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు అందించిన ప్ర‌తినిధులు

తిరుమ‌ల : క‌లియుగ దైవంగా, కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. నిత్యం త‌మ కోరిక‌లు తీరిన భ‌క్తులు నిత్యం ఏదో రూపంలో తాము భ‌ద్రంగా దాచుకున్న డ‌బ్బుల‌ను విరాళాల రూపేణా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయ‌డం, ఇంకొన్ని డ‌బ్బుల‌ను టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ట్ర‌స్టుల‌కు విరాళాల రూపేణా అంద‌జేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ విరాళాన్ని మంగళ‌వారం హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ సాఫ్ట్ వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్మోహన్ రావు టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, ఇత‌ర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *