హెచ్ ‌డీ కుమారస్వామితో చంద్ర‌బాబు భేటీ

మీ స‌హ‌కారం వ‌ల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట

న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణ‌వ్, శివ‌రాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా సీతారామ‌న్, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్, సీఆర్ పాట‌ల్ ల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను క‌లిసి విన్న‌వించారు. ఈ మేర‌కు విన‌తిప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఆయ‌న వెంట కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కూడా ఉన్నారు. వీరి వెంట ఎంపీలు కూడా హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు నాయుడు త‌న స్నేహితుడైన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి , మాజీ సీఎం హెచ్ ‌డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమ కారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని అన్నారు. ఈ సంద‌ర్బంగా ఆర్థిక సాయం చేసినందుకు ప్ర‌త్యేకంగా కేంద్ర మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *