NEWSANDHRA PRADESH

తెలుగుదేశంలోనే కొన‌సాగుతా

Share it with your family & friends

మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను పార్టీని వీడుతున్నాన‌ని, వైసీపీలోకి జంప్ అవుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు. అదంతా తానంటే గిట్ట‌ని వాళ్లు ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. ఆరు నూరైనా స‌రే కొన ఊపిరి ఉన్నంత దాకా టీడీపీలో కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీలో తాను చేర‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో, నారా లోకేష్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని అన్నారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన , బీజేపీ కూట‌మి గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు.

దోచు కోవ‌డం పైన పెట్టిన శ్ర‌ద్ద రాష్ట్ర అభివృద్ది గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.