SPORTS

రిష‌బ్ పంత్ ఆట‌కు రెడీ

Share it with your family & friends

ఐపీఎల్ లో ఆడ‌నున్న క్రికెట‌ర్

న్యూఢిల్లీ – రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి ఇటీవ‌లే కోలుకున్న ప్ర‌ముఖ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ తిరిగి ఆడేందుకు , మైదానంలోకి దిగేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ ఏడాది జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడ‌నున్న‌ట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది.

బ్యాట‌ర్ గా, కెప్టెన్ గా, వికెట్ కీప‌ర్ గా గుర్తింపు పొందాడు రిష‌బ్ పంత్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ నుండి ఉత్త‌రాఖండ్ కు వెళుతుండ‌గా ర‌హ‌దారి ప్ర‌మాదానికి గుర‌య్యాడు 2022లో. బీసీసీఐ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించింది. ఆయ‌న‌కు అయ్యే వైద్య ఖ‌ర్చుల‌ను చెల్లించింది. ఎంత ఖ‌ర్చు అయినా స‌రే తాము భ‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్.

తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు రిష‌బ్ పంత్ స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్ గా ఆడ‌తాడ‌ని , కానీ వికెట్ కీప‌ర్ గా ఆడలేక పోవ‌చ్చు. అయితే ఈసారి ఐపీఎల్ ఎప్పుడు నిర్వ‌హించాల‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి కార‌ణం వ‌చ్చే మార్చి నెల‌లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.