తెలంగాణలో 17 సీట్లు మావే
బీఆర్ఎస్ కు పోటీ చేసే అర్హత లేదు
హైదరాబాద్ – బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు దేశ వ్యాప్తంగా 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలోని 17 సీట్లు కమలానికే వస్తాయని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పనై పోయిందన్నారు.
ఎత్తి పోయిన ఆ పార్టీని జనం పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. కొందరు కావాలని బీఆర్ఎస్ , బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం నిజం కాదన్నారు కిషన్ రెడ్డి.
ఆరు గ్యారెంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 143 కోట్ల మంది ప్రజానీకం మోదీ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారని ఇదే ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నారు.
తాము రాబోయే ఎన్నికల గురించి ఆందోళన చెందడం లేదన్నారు గంగాపురం కిషన్ రెడ్డి.