పొత్తు పెట్టుకుంటే కొట్టడం ఖాయం
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
కరీంనగర్ జిల్లా – బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఈసారి ఎన్నికల్లో గులాబీ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా బండి ప్రసంగించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే జనం ఛీ కొడతారని, చివరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు తమను చెప్పుతో కొట్టడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. నిన్నటి దాకా రాచరిక వ్యవస్థను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
మమ్మల్ని బట్టలు ఊడదీసి ఉరికిస్తారంటూ స్పష్టం చేశారు. ఏపీలో పొత్తు పెట్టుకున్నా ఇదే పరిస్థితి నెలకొనడం ఖాయమని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. దేశంలో సుస్థిరమైన , సమర్థవంతమైన పాలన అందించే సత్తా ఒక్క బీజేపీ వల్లనే సాధ్యమవుతుందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.