సమ్మక్క..సారలమ్మలకు ప్రణమిల్లుదాం
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి మోదీ
న్యూఢిల్లీ – ఈ దేశంలో అత్యున్నతమైన సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీక తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మల జాతర అని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది గిరిజన బిడ్డలకు ఆరాధ్య దైవాలుగా తర తరాల నుంచి కొలుస్తూ వస్తున్నారని తెలిపారు. లక్షలాది మంది ప్రతి ఏటా మేడారంను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు మోదీ.
అడవి బిడ్డల అతి పెద్ద పండుగలలో మేడారం జాతర ఒకటి అని తెలిపారు ప్రధాన మంత్రి. మనందరి సాంస్కృతిక వారసత్వానికి , సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ వస్తోందని స్పష్టం చేశారు. ఈ చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ శుభ తరుణంలో మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతర ప్రారంభోత్సవానికి నా హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని తెలిపారు నరేంద్ర మోదీ.
ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని కొనియాడారు. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామని పిలుపునిచ్చారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని కోరారు ప్రధానమంత్రి.