NEWSANDHRA PRADESH

ఏపీలో టీడీపీ..జ‌న‌సేనదే గెలుపు

Share it with your family & friends

ఇండియా టుడే స‌ర్వేలో సంచ‌ల‌నం

అమ‌రావ‌తి – ఏపీలో స‌ర్వేలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ కొలువు తీరింది. అయితే జాతీయ మీడియా సంస్థలు స‌ర్వేలు చేశాయి. ఒక‌టి రెండు సంస్థ‌లు త‌ప్ప అన్నీ గంప గుత్త‌గా ఈసారి ఏపీలో సీన్ రివ‌ర్స్ కానుంద‌ని పేర్కొంటున్నాయి.

దీంతో వ‌రుస స‌ర్వేల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది వైఎస్సార్సీపీ . స‌ర్వేల‌న్నీ టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి అనుకూలంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశాయి. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌దర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నాయి తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.

రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు త‌థ్య‌మంటున్నాయి స‌ర్వే సంస్థ‌లు. ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్.

తాజాగా ఇండియా టుడే మూడ్ ఆప్ స‌ర్వే ప్ర‌కారం టీడీపీ, జ‌న‌సేన కూట‌మిదే జ‌యం అంటూ పేర్కొన‌డంతో వైసీపీ నేత‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది. చంద్ర‌బాబు నాయుడు రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని స‌ర్వే లో స్ప‌ష్ట‌మైంది.

ఏపీ మూడ్ మారి పోయిందంటున్న స‌ర్వేలు. టీడీపీకి 45 శాతం ఓట్ల‌తో 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 41 శాతంతో 8 మందితో ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్నాయి. 2022 ఆగ‌స్టు నుంచి తెలుగుదేశం పార్టీకి భారీగా జ‌నాద‌ర‌ణ పెరిగింద‌ని స‌ర్వేల‌లో తేలింది. జ‌గ‌న్ కు సొంత చెల్లెలు ష‌ర్మిల రాక‌తో కొంత మేర‌కు న‌ష్టం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌. ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 150కి పైగా టీడీపీ, జ‌న‌సేన గెలుస్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి.