బండికి బడిత పూజ తప్పదు
బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ బండి సంజయ్ పై నిప్పులు చెరిగింది. పదవి పోయిన ఫ్రస్టేషన్ లో ఏవేవో మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎంపిగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడిత పూజ తప్పదని హెచ్చరించారు.
బండి సంజయ్ నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే తాము చేతికి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ డిల్లీకి వెళతారంటూ ప్రచారం చేస్తే ఎందుకు తప్పు పట్టాలని ప్రశ్నించారు. ఎంపిగా తను, కిషన్ రెడ్డి ఎందుకు డిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
బిజెపి గ్రూపు తగాదాలు భరించలేక బండి సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. భూతులు మాట్లాడుతూ తన స్థాయిని రోజు రోజుకు దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి. పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు,