NEWSTELANGANA

ప్ర‌పంచంతో తెలంగాణ పోటీ ప‌డాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – యావ‌త్ ప్ర‌పంచంతో అన్ని రంగాల‌లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పోటీ ప‌డాల‌ని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఐఐ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామ‌ని చెప్పారు. రాజకీయాలు ఎలా ఉన్నా దివంగ‌త సీఎం వైఎస్, మాజీ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు సీఎం.

అభివృద్ధి విషయంలో త‌మ‌ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని అన్నారు రేవంత్ రెడ్డి. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామ‌ని చెప్పారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామ‌ని తెలిపారు.

64 ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామ‌ని వెల్ల‌డించారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామ‌ని తెలిపారు సీఎం. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇస్తామ‌న్నారు.