కల్వకుంట్ల కవితకు సమన్లు
ఫిబ్రవరి 26న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు కవితకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 26న హాజరు కావాలని ఆదేశాలలో పేర్కొంది.
మద్యం కుంభకోణంతో సత్ సంబంధాలు ఉన్నాయంటూ కవితపై ఆరోపణలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇప్పటికే పలుమార్లు ఆమెను విచారించింది. ఇదిలా ఉండగా తాను మహిళనని, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా సీబీఐ విచారణ చేపట్టిందని ఆరోపించింది కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంను ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆప్ ప్రభుత్వ అధికారులు, మంత్రులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలతో సీబీఐ , ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.